తాండూరు క్రైస్తవులకు శుభవార్త
– త్వరలో విందు, కొత్త దుస్తుల పంపిణీ
– తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవులకు శుభవార్త చెప్పింది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది క్రిస్మస్‌ను పురస్కరించుకుని విందు, కొత్త దుస్తులను అందించబోతుంది.
బుధవారం ఈ విషయాన్ని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు దృవీకరించారు. తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తాండూరులోని వివిధ గ్రామాలకు చెందిన పాస్టర్లలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని క్రైస్తవుల జాబితాపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి యేడాది మాదిరిగానే ప్రభుత్వం క్రైస్తవులకు కొత్త దుస్తులను మంజూరు చేస్తోందని తెలిపారు. దీంతో పాటు రూ. 2లక్షలతో ప్రభుత్వ విందును అందించబోతుందని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అందరికి ప్రభుత్వ నజరానను అందజేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే తేదీని ఖరారు చేసి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ, వివిధ గ్రామాల పాసర్లు పాల్గొన్నారు.


