రేపే క్రైస్త‌వుల‌కు విందు, దుస్తుల పంపిణీ

తాండూరు వికారాబాద్

రేపే క్రైస్త‌వుల‌కు విందు, దుస్తుల పంపిణీ
– హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి :  ప్ర‌తి యేడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం క్రైస్త‌వుల‌కు విందు, కొత్త దుస్తుల పంపిణీ ఆన‌వాయితీని పాటిస్తుంది. ఇందులో భాగంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని క్రైస్తవ సోద‌రుల‌కు రేపు దుస్తుల పంపిణీ ఏర్పాటు చేసిన‌ట్లు తాండూరు త‌హ‌సీల్దార్ చిన్న‌ప్ప‌ల నాయుడు తెలిపారు. ప్ర‌తి యేడాది ప్ర‌భుత్వం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విందు, కొత్త దుస్తుల‌ను పంపిణీ చేస్తుంద‌ని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి కానుక‌లు వ‌చ్చేశాయ‌ని తెలిపారు. ఇందులో భాగంగా ఈ యేడాది క్రిస్మ‌స్‌ను పుర‌స్క‌రించుకుని రేపు మంగ‌ళ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని విలియ‌మూన్ పాఠశాల‌లో సాయంత్రం 5-30 గంట‌ల‌కు దుస్తుల పంపిణీ, విందు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్రమానికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు హాజ‌ర‌వుతున్న‌ట్లు చెప్పారు. కావున పాస్ట‌ర్లు, క్రైస్తవులు త‌ప్ప‌క హాజ‌రుకావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.