ఘ‌నంగా రాజ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుకలు

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఘ‌నంగా రాజ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుకలు
– మండ‌లాల్లో సంబ‌రాలు చేసుకున్న నాయ‌కులు
– యాలాల మండ‌లంలో విద్యార్థుల‌కు ప‌ల‌క‌ల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్, తాండూరు బీసీల ముద్దుబిడ్డ కందుకూరి రాజ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం, స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆయా సంఘాల నాయ‌కులు ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు.
అదేవిధంగా రాజ్ కుమార్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ బీసీల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే రాజ్ కుమార్ రానున్న రోజుల్లో ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని విశ్వ‌సించారు.

బ‌షీరాబాద్‌, పెద్దేముల్ త‌ట్టెప‌ల్లిలో…
కందుకూరి రాజ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుకుల‌ను సంఘం నాయ‌కులు, అభిమానులు గ్రామాల్లో జ‌రుపుకున్నారు. బ‌షీరాబాద్ మండ‌ల కేంద్రంలో సంఘం మండ‌ల అధ్య‌క్షులు న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేసి రాజ్ కుమార్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం కేక్‌ను అభిమానుల‌కు, నాయ‌కుల‌కు పంచిపెట్టారు.
అదేవిధంగా పెద్దేముల్ మండ‌లం త‌ట్టెప‌ల్లిలో పీఏసీఎస్ వైస్ చైర్మ‌న్ అంజ‌య్య, వీరేశంల ఆధ్వ‌ర్యంలో రాజ్ కుమార్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా కేక్‌ను క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు.

ల‌క్ష్మీనారాయ‌ణ‌పూర్‌లో ప‌ల‌క‌ల పంపిణీ
మ‌రోవైపు యాలాల మండ‌లంలో బీసీ సంఘం నాయ‌కులు రాజ్ కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. సంఘం మండ‌ల అధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ‌చారీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు ప‌ల‌కల పంపిణీ చేప‌ట్టారు. మండ‌లంలోని ల‌క్ష్మీనారాయ‌ణ పూర్ ప్రాథ‌మిక పాఠ‌శాలలో 100 మంది విద్యార్థుల‌కు పల‌క‌ల‌ను అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీసీ సంఘం బలోపేతానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సంఘ అభివృద్ధికి పాటుపడుతున్న రాజ్ కుమార్ జన్మదిన వేడుకలను మండల పరిధిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో చెన్నారం సర్పంచ్ సాయిలు, లక్ష్మీ నారాయణ పూర్ సర్పంచ్ నర్సిములు, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మల్కాయ్య, టీఆర్ఎస్ యువ నాయకులు కృష్ణ, మండల నాయకులు గాజుల మన్నాన్, అశోక్, గ్రామ పెద్దలు వడ్ల నర్సింలు, గ్రామస్తులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.