చైర్ పర్సన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– పరిమళ్ గుప్త తల్లి మరణంపట్ల సానుభూతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, టీఆర్ఎస్ నాయకులు పరిమళ్ గుప్త కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి పరిమళ్ గుప్త తల్లి తాటికొండ కల్పన అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరిమళ్ గుప్త నివాసానికి వచ్చారు. పరిమళ్ గుప్త, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పలకరించి పరామర్శించారు. పరిమళ్ తల్లి కల్పన మరణం పట్ల సానుభూతిని ప్రకటించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు గడ్డలి రవిందర్, మసూద్, కౌన్సిలర్ వెంకన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుల్ అబ్దుల్ ఖవి, టీఆర్ఎస్ యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్ తదితరులు ఉన్నారు.
పరామర్శించిన ఎం. రమేష్
మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్ పరిమళ్ గుప్త, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కుటుంబాన్ని పరామర్శించారు.
పరిమళ్ గుప్త తల్లి మరణ వార్త తెలుసుకుని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన వెంట పెద్దేముల్ జెడ్పీటీ సి ధారాసింగ్. సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, సత్యమూర్తి దొరశెట్టి తదితరులు ఉన్నారు.

