చదువుతో పాటు నైపుణ్య రంగాల్లో్ రాణించాలి
– ప్రతిభలో రంగవల్లి ప్రదర్శన అభినందనీయం
– తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు చదువుతో పాటు విభిన్న నైపుణ్య రంగాల్లో రాణించాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. గురువారం తాండూరు ప్రతిభ స్కూల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలలో వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి సంబరాలలో బాగంగా ప్రతిభ స్కూల్ విద్యార్థులు అందరిని ఆకట్టుకునేలా 70 ఫీట్ల విస్తీర్ణంలో వేసిన భారీ ముత్యాల ముగ్గును తిలకించారు. కనువిందు చేసేలా రంగవల్లికను తీర్చిదిద్దిన విద్యార్థుల ప్రతిభను చైర్ పర్సన్ దీపా నర్సింలు మెచ్చుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థి దశలలో దాగివున్న ఇలాంటి కళానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాద్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ నరేష్ కుమార్, యాజమాన్య సభ్యులు నిర్ని చంద్రశేఖర్, పర్యాద రామకృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


