అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
అందరిని బ్రోవు దత్తాత్రేయ స్వామి..!
– గాన్గాపూర్‌లో స్వామిని దర్శించుకున్న విఠల్ నాయక్‌
– గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు సుభిక్షంగా ఉండేలా బ్రోవు దత్తాత్రేయ స్వామి అంటూ తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయగ గ్రూప్స్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ వేడుకున్నారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్‌లో వెలిసిన దత్తాత్రేయ స్వామి విఠల్ నాయక్ దర్శించుకున్నారు.

గురు పౌర్ణమి కాకుండా ప్రతినెల పౌర్ణమి సందర్బంగా ఆయన దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. గురువారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదా లను అందజేస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం విఠల్ నాయక్ .గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నసమర్పణ నిర్వహించారు .

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ గురు పౌర్ణమి పురష్కరించుకొని అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు. గురువులు దైవంతో సమానం అన్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో యాలాల మండలం పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జుంటుపల్లి రఘు, వీరన్న, అశోక్, భక్తులు ఆలయ పూజారులు భక్తులు, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..!