ఐక్య‌మత్యంతో ముదిరాజ్‌ల అభ్యున్న‌తి

తాండూరు వికారాబాద్

ఐక్య‌మత్యంతో ముదిరాజ్‌ల అభ్యున్న‌తి
– యాలాల ముదిరాజ్ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ముదిరాజ్‌లంతా ఐక్య‌మత్యంతో అభ్యున్న‌తి చెందాల‌ని వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువ‌జ‌న సంఘం అధ్య‌క్షులు లొంక న‌ర్సింలు, తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు ఎస్పీ ర‌వికాంత్‌లు అన్నారు. ఆదివారం లొంక న‌ర్సింలు, ఎస్పీ రవికాంత్‌ల ఆధ్వ‌ర్యంలో యాలాల మండ‌ల ముదిరాజ్ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. యాలాల అధ్యక్షులుగా తోట తిరుపతి(బాగాయిప‌ల్లి), ఉపాధ్యక్షులుగా బోయిని పరమేశ్వర్(దేవనూర్), రామకృష్ణ(ముకుందాపూర్), బి. రవికుమార్(పగిడ్యాల), రామకృష్ణ(కోక‌ట్), ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా తెలుగు రవి(జుంటుపల్లి), సంయుక్త కార్య‌ద‌ర్శిగా నరేందర్(సంగేంకుర్డు), వీరేందర్(నాగ సముందర్), సోషల్ మీడియా ఇంచార్జ్‌గా మహేష్(పగిడ్యాల)లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యం ఉండి అభివృద్ది చెండాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.