కరోనా కాలంలో లవంగం బెస్ట్
– రోగనిరోధక శక్తి పెంపు
– ప్రతి రోజూ తీసుకుంటే ప్రయోజనం
దర్శిని హెల్త్ : కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ భారిన పడితే మానవ శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణించి ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఉత్తమమని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. మంచి ఆహారం అంటే అందులో వైరస్‌ను ఎదుర్కునే రోగనిరోధక శక్తిని అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. సృష్టిలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు చాలా ఉన్నాయి. అయితే కరోనా కష్టకాలంలో రోగనిరోధక శక్తిని అందించే వాటిలో లవంగం ముందుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక రోగాల నుంచి బయటపడేసే లవంగాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పడు చూద్దాం..
రోగనిరోధక శక్తిని పెంపు
– కరోనా కాలంలో ప్రతిరోజూ లవంగాలను తీసుకోవడంలో ఇన్పెక్షన్ బారిన పడకుండా వీలుటుంది. ఇందులోని విటమిన్ సి, కొన్ని యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతాయి. ఇది మీ శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరములో రోగనిరోధక శక్తిని పెంచుతుంది .
జీర్ణక్రియ మెరుగు
– మానవ శరీరంలో ఏర్పడిన మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను ఈ లవంగాలు నివారిస్తాయని తేలింది. లవంగాలలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుగు పరుస్తుంది. లవంగం జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఉదయం పూట లవంగాలను తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలనైనా నయం చేయడంలో మీకు సహాయపడుతుంది.
ఎముకల సంరక్షణ
– లవంగాలతో శరీరంలో ఉన్న ఎముకల సంరక్షణ సాధ్యపడుతోంది. లవంగాలలో ఫ్లేవనాయిడ్లు, మాంగనీస్, యూజీనాలు వల్ల ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

