స్పూర్తి దాయ‌కుడు స్వామి వివేకానంద‌ : రాజ్ కుమార్

తాండూరు వికారాబాద్

స్పూర్తి దాయ‌కుడు స్వామి వివేకానంద‌
– జ‌యంతిలో నివాళులు అర్పించిన రాజ్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారతీయ తత్వశాస్త్రానికి పాశ్చాత్య ప్రపంచాన్ని పరిచయం చేసిన స్పూర్తి దాయ‌కుడు స్వామి వివేకానంద అని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధ‌వారం స్వామి వివేకానంద 159వ జ‌యంతిలో భాగంగా తాండూరు ప‌ట్ట‌ణం శాంత్ మ‌హాల్ చౌర‌స్తా సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్ర‌హం వ‌ద్ద నిర్వ‌హించిన వేడుక‌ల‌లో రాజ్ కుమార్ బీసీ సంఘం నాయ‌కుల‌తో క‌లిసి పాల్గొన్నారు. జ‌యంతి సంద‌ర్భంగా రాజ్ కుమార్ వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రు స్వామి వివేకానంద‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. ముఖ్యంగా యువ‌త‌ స్వామి వివేకానంద స్పూర్తితో స‌న్మార్గంలో ప‌య‌నించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంగం రాష్ట్ర నాయకులు సయ్యధ్ శుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్, బీసీ సంఘం యువ నాయకులు కుర్వ జగదీష్, బోయ రాధాకృష్ణ, రాము ముధిరజ్, టైలర్ రమేశ్, బస్వరాజ్, అంతరం సంతోష్, మంథన్ గౌడ్ అశోక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.