బీసీ డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం
– క్యాలెండర్ ఆవిష్కరించిన జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల డిమాండ్ల సాధనకు అందరు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బీసీ సంఘం 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ స్థాయిలో కులగణన పట్టాలని డిమాండ్ల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలన్నారు. అదేవిధంగా బీసీల సమస్యలపై ఉద్యమాలలో పాల్గొంటున్న రాజ్ కుమార్ కందుకూరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే తాండూరులో బీసీల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆర్.కృష్ణయ్యను కోరారు.
బీసీ కమీషన్ చైర్మన్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
మరోవైపు బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గంకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండరు తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
చైర్మన్‌తో పాటు హైదరాబాద్ లోని సీతాఫల్ మండి కార్పోరేటర్ సామల హేమ, టీఎంఎంఎస్ నాయకులు దీపికా ముదిరాజ్ లు కూడ క్యాలెండరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్, మల్లేష్ యాదవ్, లక్ష్మణ్, కృష్ణ, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

