జగన్నాయకుడు శ్రీకృష్ణుడు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– కృష్ణాష్టమి సంబరాలలో పాల్గొన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అవతారపురుషుడు అయిన శ్రీకృష్ణుడు జగన్నాయకుడు అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త అభివర్ణించారు. శుక్రవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వారి నివాసంలో సంబరాలు జరుపుకున్నారు. ఆమె కుమారుడికి శ్రీకృష్ణ వేషాధారణ వేశారు. పలువురు నివాసంలో జరిగిన జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీమహా విష్ణువు అవతారుడు అయిన శ్రీకృష్ణుడు లోకంలో దుష్ణ శిక్షణ, శిష్ట రక్షణ చేశారని అన్నారు. భగవద్గీత ఉపదేశం చేసి జగన్నాయకుడు అయ్యారని అభివర్ణించారు. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఆచరించాలన్నారు. పట్టణ వాసులందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.



