అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం చేసిన ఎమ్మెల్యే
– శబరి మలైలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేకపూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నెయ్యాభిషేకం చేశారు. శుక్రవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన పూజల్లో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం నిర్వహించి స్వామి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామిని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. తాండూరు ప్రజలపై అయ్యప్ప స్వామి కృప మెండుగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఆయన సన్నిహితులు ఉన్నారు.


