సెంచ‌రీకి చేరువ‌లో క‌రోనా కేసులు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

సెంచ‌రీకి చేరువ‌లో క‌రోనా కేసులు
– రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ల సంఖ్య‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు క‌రోనా కొర‌ల్లో చిక్కుకుపోయింది. ప్ర‌తిరోజు తాండూరులో క‌రోనా డెంజ‌ర్ బెల్స్‌ను మోగిస్తోంది. తాండూరు ప్రాంతంలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పైపైకి ఎగ‌బాకుతుందే త‌ప్పా త‌గ్గడంలేదు. మొన్న 43, నిన్న 60, నేడు 91 పాజిటివ్ కేసుల‌తో సెంచ‌రీ చేరువ‌గా ప‌రుగులు పెడుతోంది. ఇందుకు త‌గ్గ‌ట్టు తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచారు. వైద్య సిబ్బంది. తాండూరు ప‌ట్ట‌ణంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు ఉద‌యం నుంచే ఆసుప‌త్రికి చేరుకుని ప‌రీక్ష‌ల కోసం బారులు తీరుతున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆసుప‌త్రిలో 206 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా ఇందులో 91 మందికి పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన‌ట్లు ఆసుప‌త్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్ట‌ర్ బాస్క‌ర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైద్యులు, పోలీసుల అధికారులు మాట్లాడుతూ ప్ర‌జ‌లు క‌రోనా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. కేసులు పెరుగుతున్న కొద్ది రానున్న రోజులు కీల‌కంగా మారాయ‌న్నారు. కావున ప్ర‌జ‌లు అవ‌స‌ర‌ము మేర‌కు బ‌య‌ట‌కు రావాల‌ని, మాస్కులు, భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు.