క‌రోనా డేంజ‌ర్ బెల్స్

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

క‌రోనా డేంజ‌ర్ బెల్స్
– తాండూరులో సెంచ‌రీ దాటిన కేసులు
– 139 మందికి పాజిటివ్ నిర్దార‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో క‌రోనా మ‌హ‌మ్మారీ డేంజ‌ర్ బెల్స్‌ను మ‌రింత ఉధృతంగా మోగిస్తుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో న‌మోదైన కేసులు నేడు వంద‌కు పైగా న‌మోద‌య్యాయి. బుధ‌వారం జిల్లా ఆసుప‌త్రిలో 349 క‌రోనా నిర్దార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా 139 మందికి పాజిటివ్ నిర్దార‌ణ అయిన‌ట్లు పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్ట‌ర్ బాస్క‌ర్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఈనెల 12 న 9 మందికి, 13న 22 మందికి, 14న 26 మందికి, 16న 43 మందికి, సోమవారం 17 న 60 మందికి, మంగ‌ళ‌వారం 18న 91 మందికి క‌రోనా నిర్దార‌ణ కాగా బుధ‌వారం ఒక్క‌రోజే 139 కేసులు న‌మోదు కావ‌డం భ‌యాందోళ‌నకర‌మైన విష‌య‌మే. ఈనెల మొద‌టి నుంచి ఇప్ప‌టికు నిర్ధార‌ణ అయిన క‌రోనా బాధితుల సంఖ్య 476తో 500ల కేసుల‌కు ద‌గ్గ‌ర‌గా చేరుకుంటుంది. తాండూరులో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గురవుతున్నారు. గుంపులు గుంపులుగా ఉండే జ‌నాల‌లో ప్ర‌తి న‌లుగురిలో కరోనా ఉండొచ్చ‌ని అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక ముందు ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు, వైద్యాధికారులు సూచించారు.