తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి

తాండూరు వికారాబాద్

తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి
– 317 జీవో మేర‌కు మేనేజ‌ర్‌గా బ‌దిలీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ నూతన మేనేజర్గా నరేందర్ రెడ్డి విధుల్లో చేరారు. గత రెండు రోజులు క్రితమే భాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న బుచ్చిబాబు తెలంగాణ ప్రభుత్వం తీసువకచ్చిన 317 జీవో మేరకు ఆయన జోన్ పరిధిలోకి బదిలీపై వెళ్లారు. అదే జీవో ఉత్తర్వుల మేరకు చౌడుప్పల్ మేనేజర్‌గా పనిచేస్తూ కోడంగల్ మున్సిప‌ల్‌లో డిప్యూటేషన్‌పై వచ్చిన నరేందర్ రెడ్డిని తాండూరు మున్సిపల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి తాండూరు మున్సిపల్ మేనేజర్‌గా విధుల్లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు కల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.