సేవ‌తో పాటు క్రీడ‌ల‌కు తోడ్పాటు

క్రీడలు తాండూరు వికారాబాద్

సేవ‌తో పాటు క్రీడ‌ల‌కు తోడ్పాటు
– వీర‌శైవ స‌మాజం అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీశైలం
– స‌మాజం ఆధ్వ‌ర్యంలో వాలీబాల్ టోర్న‌మెంట్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: సేవ కార్య‌క్ర‌మాల‌తో క్రీడాకారుల‌కు తోడ్పాటు అందిస్తామ‌ని తాండూరు వీర‌శైవ స‌మాజం అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం అన్నారు. శుక్ర‌వారం స‌మాజం అధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల మైదానంలో వాలీబాల్ టోర్న‌మెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్న‌మెంట్‌ను స‌మాజం అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారుల‌తో క‌ర‌చాల‌నం చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం స‌మాజం స‌భ్యులు టాస్ వేసి మొద‌టి మ్యాచ్‌ను ప్రారంభించారు. అంత‌కుముందు అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం మాట్లాడుతూ స‌మాజం ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మాల‌తో క్రీడాకారులకు ప్రోత్స‌హాం అందిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ టోర్న‌మెంట్లో పాల్గొనే క్రీడా కారులు గెలుపు ఓట‌ముల‌ను స‌హ‌జంగా తీసుకోవాల‌న్నారు.

రెండు రోజుల పాటు టోర్న‌మెంట్
మ‌రోవైపు టోర్న‌మెంట్ నిర్వ‌హ‌కులు మాట్లాడుతూ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల మైదానంలో రెండు రోజుల పాటు మ్యాచులు కొన‌సాగుతాయ‌న్నారు. మొత్తం 40 జ‌ట్లు టోర్న‌మెంట్‌లో త‌ల‌ప‌డుతున్నాయ‌ని తెలిపారు.
మొద‌టి రోజు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి జ‌ట్ల‌తో పోటీలు జ‌రుగుతాయ‌ని, మ‌రుస‌టి రోజు అంత‌ర్ జిల్లాల క్రీడాకారుల‌తో పోటీలు జ‌రుగుత‌య‌న్నారు. ఈ టోర్న‌మెంట్‌లో నియోజ‌క‌వ‌ర్గ స్థాయి విజేత జ‌ట్టుకు రూ. 2వేలు, ద్వితీయ జ‌ట్టుకు రూ. 1 వెయ్యి, ఓపెన్ టు ఆల్ విభాగంలో విజేత జ‌ట్టుకు రూ. 10 వేలు, ద్వితీయ జ‌ట్టుకు రూ. 5వేల న‌గ‌దు బ‌హుమ‌తితో పాటు ట్రోఫీల‌జు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వీర‌శైవ స‌మాజం గౌర‌వాధ్య‌క్షులు తంబాకు చంద్ర‌శేఖ‌ర్, ఉపాధ్య‌క్షులు ప‌ర‌మేశ్వ‌ర్, జాయింట్ సెక్ర‌ట‌రి ప‌టేల్ విజ‌య్ కుమార్, మాజీ అధ్య‌క్షులు అగ్గ‌నూర్ జ‌గ‌దీశ్వ‌ర్, స‌భ్యులు బంటారం భ‌ద్రేశ్వ‌ర్, మాజీ కౌన్సిల‌ర్ కోర్వార్ ర‌మేష్‌, రిటైర్డ్ ఏసీటీఓ ప‌టేల్ ఉద‌య్ శంక‌ర్, రిటైర్డ్ ఎమ్మార్వో ఎడ్రామి సిద్రామ‌ప్ప‌, మ‌హేష్ మేడి, వీర‌శైవ యువ‌ద‌ళ్ స‌భ్యులు ప‌టేల్ కిర‌ణ్ కుమార్, విజ‌య బాస్క‌ర్, స‌భ్యులు, యువ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.