శివాజీ శోభాయాత్ర ప్రశాతంగా జరుపుకోవాలి
– తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్
– హిందూ ఉత్సవ సమితితో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో నిర్వహించే చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ సూచించారు. శుక్రవారం తాండూరు హిందూ ఉత్సవ సమితి, శివాజి ర్యాలీ నిర్వహకులతో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా ఆదివారం నిర్వహించే శోభాయాత్రపై పలు సూచనలు, సలహాలు అందించారు. ర్యాలీ నిర్వహణపై ఆరా తీశారు. పట్టణంలో శివాజీ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రలో పోలీసుల నిఘా ఉంటుందని, అవాంచనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు రజనీకాంత్, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.


