రాత్రి కర్ఫ్యూ ఇప్పట్లో లేనట్టే..!
– కరోనా తీవ్రత అదుపులోనే ఉంది
– డీహెచ్ డాక్టర్ శ్రీనివాస రావు స్పష్టత
హైదరాబాద్, దర్శినిధి: తెలంగాణలో కరోనా ఉధృతి అదుపులో ఉందని, ఈ కారణంగా ఇప్పట్లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా లేదని అన్నారు. పాజిటివిటీ 10% దాటితేనే రాత్రి కర్ఫ్యూ అవసరం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16%గానే ఉంది. ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10% మించలేదు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45% ఉంది. కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14% ఉంది. ముందుజాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల31వరకు ఆంక్షలు విధించాం. వారంరోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోంది. మూడురోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశాం” అని డీహెచ్ వివరించారు.

