శివ పాదయాత్రతో సౌభగ్యాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

శివ పాదయాత్రతో సౌభగ్యాలు
– తాండూరు నుంచి శ్రీశైలంకు పాదయాత్ర
– బీఆర్ఎస్ నాయకులు సాగర్‌ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: శివున్ని తలుస్తూ చేపట్టిన పాద యాత్రతో ప్రజలందరికి సౌభగ్యాలు సిద్దిస్తాయని బీఆర్ఎస్ తాండూరు ప్రచార కార్యదర్శి, తాండూరు సెలబ్రిటి సాగర్ గౌడ్ అన్నారు. మంగళవారం సాగర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు నుంచి శ్రీశైలంకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం రసూల్ పూర్ హనుమాన్ దేవాలయం వద్ద కూడ పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి దాదాపు 150 మంది భక్తులు పాదయాత్రగా బయల్దేరారు.

సాగర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి యేడాది సంక్రాంతి తరువాత తాండూరు నుంచి శ్రీశైలంకు పాదయాత్ర చేపడుతున్నామన్నారు. శ్రీశైలంకు పాదయాత్ర చేపట్టిన సంకల్పంతో కరోనా మహామ్మారిని జయించుకున్నామన్నారు. శివుని కృపతో చేపట్టిన పాదయాత్రతో సకల సౌభగ్యాలు సిద్దిస్తియన్నారు. తాండూరు నుంచి బయల్దేరిన పాద యాత్ర వారం రోజుల్లో శ్రీశైలంకు చేరుకుంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్రను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.