ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ నాయ‌క‌త్వంలో తిరుగులేని శ‌క్తిగా మార్చేందుకు కృషి చేస్తామ‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ అధ్యక్షులుగా డా.మెతుకు ఆనంద్ గారు నియమితులైన సందర్భంగా మంగ‌ళ‌వారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు ఎమ్మెల్యే ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ…ఓవైపు డాక్టర్ గా ప్రజలను కాపాడుతూ ఎమ్మెల్యేగా ప్రజామెప్పు పొందుతూ జిల్లా అధ్యక్షులుగా పార్టీని పటిష్ఠంచేసే గొప్ప బాధ్యత వ‌రించిందని అన్నారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నాయ‌క‌త్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకు ఊరూరా ప్రతి గ్రామాల్లో నియమించిన గ్రామకమిటి, పట్టణ కమిటీ నాయకులు కృషి చేయాల‌న్నారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(న‌యూం), కౌన్సిలర్లు సందుల‌ లతాగౌడ్, ఎర్రం వసంత, మంకాల్ రాఘవేందర్, భీంసింగ్, ముక్తర్, కో-ఆప్షన్ సబ్యులు వెంకట్రామ్ ప‌వార్, నాయకులు గుండప్ప, రాజన్ గౌడ్, శ్రీధర్, శ్రీనివాస్, ఇంతియాజ్ బాబా, ఈర్షద్, ఆశ్ఫక్, జాకీర్, శివానంద్, సంతోష్ గౌడ్, మొయిజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.