టిక్కెట్టు.. టెన్షన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టిక్కెట్టు.. టెన్షన్..!
– బీఆర్‌ఎస్‌నే నమ్ముకున్న పైలెట్
– రెండు పార్టీలపై గురిపెట్టిన పట్నం..?
– బీజేపీ నేత ఆశ గల్లంతే..
– రసవత్తరంగా రాజకీయాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్‌ దూసుకెళుతోంది. ఎన్నికలు ఎప్పుడోస్తాయా అని ప్రజలు అతురుతగా ఎదురుచూస్తున్నారు. అయితే బరిలో నిలిచే అభ్యర్థులు మాత్రం ఎడతెగని టెన్షన్‌లో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గులాబీ బాస్ అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేయడంపై టిక్కెట్టు ఎవరికి వరిస్తుందనే ఆ పార్టీ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు తనకే వస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. బీజేపీని ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల ఎర కేసులో ఇరికించడం, కాంగ్రె్‌సను వీడి బీఆర్‌ఎ్‌సలో చేరడంతో తనకే టికెట్‌ వస్తుందని రోహిత్‌రెడ్డి నమ్మకంతో ఉన్నారు.

ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ సైతం తాండూరు టిక్కెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్టు దక్కకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సంసిద్దంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహేందర్ రెడ్డికే టిక్కెట్టు కన్‌ఫాం అయినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉంచి తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్టును టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ కూడా గట్టిగా ఆశిస్తున్నారు. గతంలో రెండుసార్లు టికెట్‌ దక్కి చివరకు టికెట్‌ త్యాగం చేశారు. బీసీ కోటాలో తనకే టికెట్‌ ఇస్తారని ఆశలో ఎం.రమేష్‌ ఉన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో బీసీలకు రెండు స్థానాలు కేటాయించాలనే ఆలోచన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో సీనియర్‌గా ఉన్న ఎం.రమే్‌షకు బీసీ కోటాలో టికెట్‌ వస్తుందనే ఆశలో ఉన్నారు. ఇక బీజేపీలో మొన్నటి వరకు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ ముందు నుంచి ఆశలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో యు.రమే్‌షకు టికెట్‌ దక్కినట్లు దక్కి చేజారింది. అనూహ్యంగా ఎన్‌ఆర్‌ఐ పటేల్‌ రవిశంకర్‌ బీజేపీ టికెట్‌ను దక్కించుకున్నారు. దీంతో యు.రమేష్‌ అప్పట్లో పార్టీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో మళ్లీ తిరిగి బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే యు.రమేష్ పార్టీలో ఉండగానే రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో చేరిన వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణగౌడ్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు తెరమీదకొచ్చాయి.

తాజాగా డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి బీజేపీలోకి రావడంతో ల క్ష్మారెడ్డి టికెట్‌ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీలో టిక్కెట్టు ఆశించిన యు.రమేష్‌ కుమార్ ఆశలు గల్లంతు అయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మద్య ఏ పార్టీలో కూడా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో టిక్కెట్టు ఎవరికి వరిస్తుందో అని అటు నేతలు, ఇటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!