తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు
– ప్రకటించిన విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. గత రెండేళ్లుగా విద్యార్థులను ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఈ సారి తప్పక పరీక్షలకు రాయాల్సిందేనని తేల్చి సూచించింది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి సోమవారం విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 20 నుంచి జరగనున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయని, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని, అదేవిధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. గతంలో కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులను ప్రమోట్ చేయగా.. ఈ సారి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవ్వరిని ప్రమోట్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ మొగ్గుచూపింది.
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్
ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 21 నుంచి మే5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్
20,22,25,27,29 మే 2 వ తేదీలలో ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలు
ఏప్రిల్ 21,23,26,28,30,మే 5 వ తేదీలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు
ఏప్రిల్ 11 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరా్మెంటల్ పరీక్ష
మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు.

