సీఎం సహాయ నిధి పేదలకు వరం
– ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎం సహాయ నిధి పేదలకు వరం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పాత తాండూరుకు చెందిన ఎం.సురేష్ కుమార్కు రూ. 60 వేలు, యు.వీర లక్ష్మికి రూ. 18 వేలు, 34 వ వార్డుకు చెందిననూర్జా బేగంకు 1 లక్ష, యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన బి.అనంతయ్యకు రూ. 52 వేలు, యాలాలకు చెందిన జి.లావణ్యకు రూ. 37,500ల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ళ నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ళ సాయిపూర్ బాల్ రెడ్డి, యాలల పీఏసీఎస్ మాజీ చైర్మెన్ సిద్రాల శ్రీనివాస్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ళ నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాలా, కౌన్సిలర్ రాము, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, నాయకులు బీదర్ రాజశేఖర్, బిర్కడ్ రఘు, రాకేష్, అశోక్ మంతన్ గౌడ్, ఏర్రం శ్రీధర్, బషీరాబాద్ మండల నాయకులు సహాకార సంఘం డైరెక్టర్ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

