అంపల్లి సిద్దమ్మకు ఎమ్మెల్సీ నివాళి
– కుటుంబాన్ని పరామర్శించిన మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం కందనెల్లి మాజీ ఎంపీటీసీ అంపల్లి సిద్దమ్మకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం అంపల్లి సిద్దమ్మ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కందనెల్లి గ్రామానికి చేరుకున్నారు. నివాసంలో ఉంచిన సిద్దమ్మ భౌతికఖాయానికి ఎమ్మెల్సీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. సిద్దమ్మ కుమారులు అంపల్లి ఆశప్ప, రవి, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కరుణం పురుషోత్తం రావు, సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ మొగులప్ప తదితరులున్నారు.

