రూ. 20లక్షలకు మాంసం వ్యర్థాల రవాణా వేలం

తాండూరు రాజకీయం వికారాబాద్

రూ. 20లక్షలకు మాంసం వ్యర్థాల రవాణా వేలం
– స్లాటర్ హౌజ్‌ వేలంకు రూ. 64వేల ఆధాయం
– పోటీ పడి దక్కించుకున్న వ్యాపారులు
– నిబంధనలు అతిక్రమిస్తే టెండర్లు రద్దు చేస్తాం
– మున్సిపల్‌ చైర్‌ పర్సన్, కమీషనర్ స్పష్టం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల సేకరణ, రవాణా కోసం నిర్వహించిన బహిరంగ వేలంకు స్పందన లభించింది.

మాంసం వ్యర్థాల రవాణా రూ. 20లక్షలు వేలం రాగా స్లాటర్ హౌజ్‌ వేలం రూ. 64వేలు వరకు పాడారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణ, రవాణాతో పాటు స్లాటర్ హౌజ్‌ కోసం బహిరంగ వేలం నిర్వహించారు. చికెన్, మటన్‌, చేపల వ్యర్థాల సేకరణ రవాణా టెండర్ కోసం ఎజాజ్, అబ్దుల్ రహీంలు పోటీ పడ్డారు. ఎజాజ్ రూ. 17లక్షల 7వేలు పాడగా.. అబ్దుల్ రహీం రూ. 20లక్షలకు వేలం పాడి టెండర్‌ను దక్కించుకున్నారు.

అదేవిధంగా స్లాటర్ హౌస్ బహిరంగ వేలంలో ఎండీ. మజీద్, ఖురేషులు పాల్గొన్నారు. ఇందులో ఎండి మజీద్ అత్యధికంగారూ. 64 వేలు పాట పాడి వేలాన్ని దక్కించుకున్నారు. అనంతరం చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ నిబంధనలు అనుగుణంగా కార్యకలాపాలు జరుపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే టెండర్లు రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 31మార్చ్ 2027 వరకు ఈ టెండర్ ఉంటుందని తెలిపారు. టెండర్లు పాడిన ధరను 7 పని దినాలలో మున్సిపాలిటీకి జమ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జి రాములు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సూపర్ పోలీస్..!