కాక రేపిన కేసీఆర్ బర్త్ డే
– కోస్గిలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
– గాడిదతతో కేసీఆర్ జన్మదిన వేడుకలు
– అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు
దర్శిని డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉత్సహాంగా జరుగుతుంటే నారయణపేట్ (వికారాబాద్) జిల్లా కోస్గిలో కాక పుట్టించాయి. కేసీఆర్ బర్త్ డే వేడుకలు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మద్య సెగలు పుట్టించాయి. రాళ్లు, కర్రలతో ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని నిరసన తెలిపే విధంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి విషయాలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిరసనలు తెలపాలని సూచించారు. ఈ క్రమంలో కోస్గిలోని కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గాడిదతో కేక్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఈ విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ ఎంఎల్ఎ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడి చేసుకన్నాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. రాళ్లు రువ్వుకుంటున్న రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

