కాంగ్రెస్ ప్రాజెక్టులను దగా చేసిన సర్కారు
– కేసీఆర్ సొంత జిల్లాకు చేవేళ్ల ప్రాణహిత
– పాలమూరు – రంగారెడ్డిని అటకెక్కించిన ప్రభుత్వం
– ఇచ్చిన హామిలను విస్మరించి జిల్లా ప్రజలకు మోసం
– మన ఊరు – మన పోరును జయప్రదం చేయండి
– డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రాజెక్టులు, పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుని దగా చేసిందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డిలు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, రమేష్ మహారాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో చేవేళ్ల-ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం వాటిని అడ్డుకుందన్నారు. చేవేళ్ల-ప్రాణహితను రీడిజైన్ పేరుతో కేసీఆర్ సొంత జిల్లాలో చేపడుతున్న పోచమ్మ రిజార్వాయుర్‌కు తరలించి జిల్లా రైతాంగం పొట్ట కొట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. అదేకాకుండా రూ. 1900 కోట్ల నేవీ రాడారు కూడ అడ్డుకున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అంతర్జాతీయ వివాదంగా మార్చి అటకెక్కించిందన్నారు. అప్పటి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని కూడ మార్పులు చేసి వాడుకుటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఇంటి తాళం కూడ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోని హామీలను ఇచ్చి విస్మరించిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, టీఆర్ఎస్ మోసపూరితన పాలను వివరించి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు, చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నయవంచన పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. వారి మోసాలను ప్రజల ముందుంచి ప్రజల పక్షాన పోరాడడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు, ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మన ఊరు, మన పోరు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈనెల 26న పరిగిలో మన ఊరు – మన పోరు పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదులో కాంగ్రెస్ పార్టీ దూసుకపోతుందన్నారు. 30 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా చేసుకుంటే 37 లక్షల వరకు నమోదయ్యిందన్నారు. ఇంకా 40 లక్షల వరకు సభ్యత్వ నమోదు కావచ్చని ధీమా వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై కార్యకర్తలతో పాటు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, ఎం.ఎ ఆలీం, యాలాల మండల అధ్యక్షులు భీమయ్య, నాయకులు సయ్యద్ షుకూర్, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, యువనాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్, గాజుల మన్నన్. వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

