అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి
– నిర్లక్ష్యం చేస్తే చర్యలు : మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రజలు అందరు తమ ఆస్తిపన్నులను చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు బకాయిలు వసూల్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్లో ఆస్తిపన్నుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న లారీ పార్కింగ్ షాంపింగ్ కాంప్లెక్స్ లో కౌంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు బకాయిలు పడ్డవారంతా చెల్లింపులు చేయాలని అన్నారు. పన్నుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్తి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాడలని విజ్ఞప్తి చేశారు.

