గులాబీ అధ్యక్షులు వీరే
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గంలోని మండలాల, పట్టణ అధ్యక్షుల ఎంపిక పూర్తయ్యింది. మంగళవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్‌లో జరిగిన సమావేశంలో చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, తాండూరు ఇంచార్జ్ జహాంగీర్ పాషల సమక్షంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల అధ్యక్షులతో పాటు తాండూరు పట్టణ అధ్యక్షులను ఎన్నుకున్నారు. తాండూరు పట్టణ అధ్యక్షులుగా అఫ్పూ(నయూం), తాండూరు మండల అధ్యక్షులుగా రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులుగా కోహీర్ శ్రీనివాస్ యాదవ్, యాలాల మండల అధ్యక్షులు మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులుగా రాములు నాయక్‌లను ఎన్నుకున్నట్లు పార్టీ ఇంచార్జ్ జహాంగీర్ పాష ప్రకటించారు.
