సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి
– జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి
– ఎమ్మెల్సీ నివాసంలో అట్టహాసంగా కేక్ కటింగ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి హాజరైనే తలు, కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ బర్త్ డే కేకును కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, పంటలకు పెట్టుబడి, ఉచిత నిరంతర విద్యుత్ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి. వైపు ముందుండి నడిపించారని అన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు మసూద్, మన్మోహన్ సార్జా, బిర్కడ్ రఘు, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, వెంకన్నగౌడ్, రవి, యువనాయకులు దత్తూ, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.