హిందు ధర్మరక్షకుడు శివాజీ మ‌హారాజ్

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందు ధర్మరక్షకుడు శివాజీ మ‌హారాజ్
– తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
– పెద్దేముల్ గొట్ల‌ప‌ల్లిలో శివాజీ మ‌హారాజ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: హిందూ ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ‌కు అవత‌రించిన మ‌హాయోధుడు చత్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు అన్నారు. శ‌నివారం చత్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ 392వ జ‌యంతి సంద‌ర్భంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దేముల్ మండ‌లం గోట్ల‌ప‌ల్లిలో శివాజీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు నారాయణఖేడ్ స్వామిజీ సంగ్రామ్ మహరాజ్‌తో క‌లిసి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మ‌రాఠా యోధుడు హిందూ ధర్మ పరిరక్షకులు చ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ అని అన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి నిలిపి హిందు ధర్మరక్ష‌ణ‌కు శివాజీ మహారాజ్ ఎంతో కృషి చేశార‌ని అన్నారు. శివాజీని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ ర‌మేష్‌, జెడ్పీటీసీ ధారాసింగ్, వైస్-ఎంపీపీ మధులత శ్రీ‌నివాస్ చారి,నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, గుండప్ప, సంజీవ్ రావు, సంతోష్ గౌడ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.