పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
– 30 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : 30 ఏండ్ల తరువాత పూర్వ విద్యార్థులు ఒకే వేడుకలో కలుసుకున్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం మైల్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92లో పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. శుక్రవారం చదువుకున్న పాఠశాలలో ఈ వేడుకను జరుపుకున్నారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులతో పాటు పూర్వ విద్యార్థులు కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు మళ్లీ మళ్లీ ఇలాంటి రోజులు రావాలని అభిప్రాయాలను తెలుపుకున్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage