ఆసుపత్రిలో మెరుగైన సేవ‌ల‌పై దృష్టి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆసుపత్రిలో మెరుగైన సేవ‌ల‌పై దృష్టి
– మౌళిక వ‌సతుల క‌ల్ప‌న‌కు కృషి
– వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి
– ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల‌కు మెరుగైన సేవ‌లందించేందుకు ప్ర‌త్యేక దృష్టిసారించ‌డం జ‌రుగుతుంద‌ని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్మాణానికి జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో గతంలో రూ. 60లక్షలతో సీసీ బెడ్లు, ప్రహారి గోడ, మూడు గెట్లు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో పాటు రోగుల అటెండర్ల కోసం వేయిటింగ్ రూం నిర్మించి, తాగునీటి వసతి కల్పించడం జరిగిందన్నారు. తాజాగా పారిశుద్ధ్య ప్రాధాన్యతలో భాగంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డుల్లో పరిశుబ్రతకు ప్రాధాన్యమిచ్చి మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటిని ఏర్పాటు చేసి మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్లాల, కౌన్సిలర్లు రవి, వెంకన్నగౌడ్, ఎంపీటీసీ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ చారి, నాయకులు గడ్డలి రవిందర్, అశోక్, రమేష్. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.