మెప్మా ఆర్పీ గారడీ..!
– స్త్రీనిధి రుణాల గోల్మాల్
– రూ.2.98 లక్షల నిధుల దుర్వినియోగం
– జిల్లా అధికారుల విచారణలో బట్టబయలు
ఆర్పీని సస్పెండ్ చేయాలి: టీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మెప్మాలో రీసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న ఓ మహిళ స్త్రీనిధి రుణాలలో గారడి చేసింది. సంఘాల సంఘాల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించకుండా దుర్వినియోగానికి పాల్పడింది. మహిళ సంఘాల ఫిర్యాదుతో పాటు జిల్లా అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆర్పీ అక్రమాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలాలిలా ఉన్నాయి. మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి జయశ్రీ రీసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పనిచేస్తుంది. అయితే కాలనీలోని 12 మహిళ సంఘాలకు మంజూరైన స్త్రీనిధి రుణాలను ఆమె దుర్వినియోగం చేసినట్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో మహిళ సంఘాల సభ్యులు తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ తో పాటు మెప్మా, స్త్రీనిధి అధికారులకు ఫిర్యాదు చేశారు. తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ ఆదేశాల మేరకు మెప్మా జిల్లా అధికారులు రవికుమార్, తాండూరు అధికారి వెంకటేష్ లు విచారణ జరిపారు. మొత్తం 12 మహిళ సంఘాల సభ్యులతో మాట్లాడి విచారణ చేపట్టారు. మహిళ సంఘాలు ఆరోపించిన రూ.2లక్షల 98,541లో దాదాపు రూ.2 లక్షల వరకు దుర్వినియోగం అయినట్లు తేలిందని తెలిపారు. ఈ విచారణ నివేధికను ఆర్డీఓ, ఇంచార్జ్ మున్సిపల్ కమీషనర్లకు అందజేస్తామని, ఈ మేరకు ఆర్చీపై చర్యలు తీసుకొ వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆర్పీ జయశ్రీని సస్పెండ్ చేయాలి: ఈర్షాద్ టీఆర్ఎస్ నాయకులు
మహిళ సంఘాల సభ్యులను మోసం చేసిన ఆర్పీ జయశ్రీని సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్ డిమాండ్ చేశారు. రూ. 2లక్షల 98 వేల స్త్రీనిధి రుణాల దుర్వినియోగంతో పాటు గతంలో ఆర్పీగా పనిచేసిన రాజేశ్వరికి చెందాల్సిన వేతం రూ. 26 వేలు, మంజుల అనే మహిళ పేరుతో సంఘం నుంచి రూ. 51,460లను రుణం తీసుకుంటుందని ఆరోపించారు. రుణాల దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చాలా మంది బెదిరింపులకు పాల్పడ్డారని, మహిళ సంఘాలకు న్యాయం జరిగే వారకు పోరాడుతామని పేర్కొన్నారు.
https://youtu.be/M2fOft7HvTw
https://youtu.be/0LBUXRnrQPI

