మ‌ళ్లీ కాగ‌నున్న వంట నూనె..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ

మ‌ళ్లీ కాగ‌నున్న వంట నూనె..!
– భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు
– భార‌త్‌పై ఉక్రేయ‌న్ – ర‌ష్యా యుద్ద ప్ర‌భావం
ద‌ర్శిని డెస్క్ : వంటింటికి నూనె ధ‌ర‌లు సెగ‌లు అంటించ‌బోతున్నాయి. భార‌త్‌లో మ‌ళ్లీ వంట నూనెలు పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే, అనేక దేశాలపై ఎఫెక్ట్‌ పడనుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మన దేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్ప‌త్తి త‌క్కువ‌గా జ‌రుగుతుంది. భారతదేశంలో ఉత్పత్తయిన ఆయిల్ కేవలం 10 శాతం జనాభాకి మాత్రమే సరిపోతుంది. మన దగ్గర పామ్ ఆయిల్ తరువాత ఎక్కువగా వాడేది సన్ ఫ్లవర్ ఆయిల్ కావడం గమనార్హం. 2021లో మన దేశం దాదాపు 74శాతం సన్‌ఫ్లవర్ (Sunflower Oil) ఆయిల్‌ను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉంది భారత్. ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి మనం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంటాం. అయితే.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరిగితే, ఒక్క భారతదేశం మాత్రమే కాదు, చాలా దేశాలపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే ఆయిల్ భారీగా పరిగాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సరఫరా కొరత నేపథ్యంలో ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్‌ల ధరలు 15 లీటర్ల క్యాన్‌కు కనీసం రూ.100, రూ.150 వరకు పెరిగిందని పూణే గుల్తెక్డి మార్కెట్ యార్డ్‌లోని వ్యాపారులు తెలిపారు. అయితే.. భారతదేశం 2020-21లో దాదాపు 63% అంతర్గత రవాణాతో… వంట నూనె దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతుంది. అంతర్జాతీయ సరఫరాదారుల నుంచి నూనె సరఫరా కొరత కారణంగా ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.