బీసీల కోసం రూ. 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల కోసం రూ. 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
– బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ అభివృద్ధి, సంక్షేమానికి బ‌డ్జెట్‌లో రూ. 10 వేల కోట్ల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 2022-23ను పుర‌స్క‌రించుకుని ప‌ట్ట‌ణంలోని సౌర‌మ్మ దేవాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ బడ్జెట్ లో గత నాలుగు సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఐదు లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చార‌ని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయ‌న్నారు. వీరికి సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఈ బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 12 బిసి కులాల ఫెడరేషన్ లకు జనాభా నిష్పత్తిలో రెండు వేల కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకై ఈ సంవత్సరం అదనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. సొంత భవనాలు కూడ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల విదేశీ విద్య కొరకై అప్లై చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి విదేశీ విద్య కింద రుణాలు మంజూరుకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని అన్నారు. పెరిగిన ధరల అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్లను మరియు మెస్ ఛార్జీలను పెంచే విధంగా బడ్జెట్ రూపొందించాలన్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల కొరకై కోచింగ్ పద్ధతులు మార్చి అర్హులైన అందరికీ DSC పోలీస్ ఎస్ఐ గ్రూప్12434 రైల్వే బ్యాంకింగ్ తదితర కోచింగ్ కోసం బీసీ స్టడీ సర్కిల్ కు 200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో 2017 డిసెంబర్ 3 4 5 తేదీల్లో మూడు రోజులు ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి 210 తీర్మానాలతో బీసీ పాలసీలు రూపొందించారు వాటన్నిటినీ వెంటనే అమలు చేయడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల మండల అధ్యక్షుడు లక్ష్మణ్ చారి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్, బీసీ యువ నాయకులు తాండ్ర నరేష్, సెరోస్ నాయకులు శివ, మండల అధ్యక్షులు బసంత్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు బాలు, బీసీ మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, విజయలక్ష్మి, జయ, బోయ రాధక్రిష్ణా, బస్వరాజు, జుంటిపల్లి వెంకట్, మతీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.