తాండూరు పోలీస్టేషన్ కు సైబర్ వారియర్ ఎంపిక

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పోలీస్టేషన్ కు సైబర్ వారియర్ ఎంపిక
– టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయా ద్వారా ప్రశంసలు
– అభినందించిన తాండూరు డీఎస్పీ, పట్టణ సీఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్ లో సైబర్ వారియర్ ఎంపిక జరిగింది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారహిల్స్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 25 మంది సైబర్ వారియర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో 15 మందిని ఎంపిక చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ నుంచి మహేష్ కుమార్ సైబర్ వారియర్ గా ఎంపికయ్యారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరచడం పట్ల టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్ లు సైబర్ వారియర్ గా ఎంపికైన మహేష్ కుమార్ ను అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఇదికూడా చదవండి..

బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు