పెరుమాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

తాండూరు రాజకీయం వికారాబాద్

పెరుమాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నమస్తే తెలంగాణ సీనియర్ పాత్రికేయుడు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. శ‌నివారం వెంక‌ట్ రెడ్డి అన్న అనంతరెడ్డి భార్య లక్ష్మి ఆకస్మికంగా మృతి చెందారు. ఆదివారం ఈ విష‌యం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠలనాయక్ ల‌తో క‌లిసి తాండూరు మండ‌లం ఖాంజాపూర్ గ్రామంలో పెరుమాళ్ల కుటుంబానికి వెళ్లారు. పెరుమాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని, చిన్నగా ఉన్న ఇద్దరు పిల్లల ఉన్నత చదువులు చదివేందుకు తమ సహకారం ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాందాస్, సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.