ఫీల్డ్ అసిస్టెంట్‌, సెర్ఫ్, మెప్మా ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఫీల్డ్ అసిస్టెంట్‌, సెర్ఫ్, మెప్మా ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌
– ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ‌ రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ల‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవ‌డంతో పాటు సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అని చెప్పి ఉపాధిహామీలో పని పని చేసేవారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదని… సమ్మె వద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారన్నారు. ఇప్పుడు తప్పుతెలుసుకున్నారని.. వాళ్లు పొరపాటు చేశారన్నారు. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారని తెలిపి.. ఓ పెద్దన్నలా క్షమించి.. మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామన్నామ‌ని ప్ర‌క‌టించారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారని.. ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. ఇక మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తామన్నారు.