నిప్పుతో జాగ్రత్త..!
– అప్రమత్తతో ప్రమాదాల నియంత్రణ
– తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున
తాండూరు, దర్శిని ప్రతినిధి: వ్యాపారులు, ప్రజలు నిప్పుతో సంబవించే అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాండూరు అగ్నిమాపక కేంద్ర అధికారి(ఫైర్ ఆఫీసర్) జినాగార్జున అన్నారు. శుక్రవారం తాండూరు కార్యాలయంలో పట్టణంలోని పాత సామాగ్రి వ్యాపారులు, కాటన్ నిల్వ వ్యాపారులు, టింబర్ వ్యాపారులతో ఫైర్ ఆఫీసర్ నాగార్జున సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు, షాక్ సర్క్యూట్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే 8712699356, 8712699357లకు గాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 101లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


