సీఎం కేసీఆర్ చొర‌వ‌తోనే పేదలకు ఆసరా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్ చొర‌వ‌తోనే పేదలకు ఆసరా
– సంక్షేమంలో తెలంగాణ దేశంలో నెంబ‌ర్ వ‌న్
– 57 ఏండ్లకే ఫించన్‌తో వృద్ధుల‌ ఆత్మగౌరవం పెంపు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– మున్సిపల్ లబ్దిదారులకు కార్డుల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ‌తోనే 57 ఏండ్ల వారంద‌రికి ఆస‌రా అందుతుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేదలకు ఆసరా ఫించన్ అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్లోని 1నుంచి 18 వార్డులకు సంబంధించి ఆసరా ఫించన్ దారులకు కార్డుల పంపిణీ జ‌రిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని అన్నారు. వత్రోత్సవ కానుకగా 65 ఏండ్ల వారికే కాకుండా 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా ఫించన్ అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మందికి కొత్త ఆసరాను అమలు చేస్తున్నారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళ, డయాలిసిస్ బాధితులు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు ఫించన్ అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆసరా పథకంలో వృద్ధులు, పేదల ఆత్మగౌరవాన్ని పెంచి.. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, నర్సిరెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, కౌన్సిలర్లు అస్లాం తదితరులు పాల్గొన్నారు.