ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 1.21 లక్షలు
– మసీదుకు 400 గజాల స్థలం విరాళం
– ఉధారతను చాటిన నర్సింహారెడ్డి(బాబు)
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి సోదరుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి నర్సింహారెడ్డి(బాబు) మరోసారి ఉధారతను చాటారు. ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆర్థిక సహాయం, మసీదు నిర్మాణానికి భూమిని విరాళంగా అందజేశారు. శనివారం నర్సింహారెడ్డి తాండూరు మండలంలోని మిట్టబాస్పల్లి, కోటబాస్పల్లి గ్రామాలను సందర్శించారు. మిట్టబాస్పల్లిలో పునర్ నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ. 1లక్ష 21 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. అదేవిధంగా కోటబాస్పల్లి గ్రామంలో మసీదు నిర్మాణానికి తన వంతు సహాకారంగా 400 గజాల భూమిని విఠాళంగా అందజేశారు.
సామాజిక సేవలను అందిస్తున్న నర్సింహారెడ్డి మరోసారి దేవాలయానికి, మసీదుకు సహాకారం అందించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు నర్సింరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ తదితరులు ఉన్నారు.

