ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

తాండూరు వికారాబాద్

ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
– టీపీయూజేఏసీ జిల్లా అధ్యక్షులుగా గొగోళ్ల అరవింద్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలోని ప్రైవేటు ఉద్యోగులు, సిబ్బంది సమస్యల ఉద్యోగుల పరిష్కారంతో పాటు వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తానని తెలంగాణ ప్రైవేటు జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీయూజేఏసీ) జిల్లా అధ్యక్షులు గొగోళ్ల అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం టీపీయూజేఏసీ జిల్లా అధ్యక్షులుగా అరవింద్ కుమార్ నియామకమయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరిగిన సమావేశంలో టీపీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కలమడుగు రాజేందర్ చేతుల మీదుగా అరవింద్ కుమార్ నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీయూజేఏసీ జిల్లా అధ్యక్తులుగా నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, ఉపాధ్యక్షులు ధర్మారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి రాజకీయ, ప్రజా సంఘాల సహాకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా టీపీయూజేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంగూరి వెంకటయ్య, గజ్జల శివశంకర్, చిప్పేప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.