వార్డుల‌ అభివృద్ధికి ప్ర‌త్యేక దృష్టి

తాండూరు రాజకీయం వికారాబాద్

వార్డుల‌ అభివృద్ధికి ప్ర‌త్యేక దృష్టి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
– 25వ వార్డులో సీసీ డ్రైన్ ప‌నులు ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌ట్ట‌ణంలోని వార్డు అభివృద్ధికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 25వ వార్డులో 14వ ఆర్థికసంఘం నిధులతో నిర్మిస్తున్న డ్రైన్ నిర్మాణ పనులను వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు వార్డు కౌన్సిల‌ర్, ప్ర‌భాక‌ర్ గౌడ్‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ వార్డుల‌ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా క‌లిసి ముందుకు సాగాల‌న్నారు. రానున్న రోజుల్లో ప‌ట్ట‌ణంలోని అన్ని వార్డుల‌లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదేవిధంగా ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సీజనల్ వ్యాధుల నివారణకు తోడ్పడలని సూచించారు. వార్డు కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి అంచెలంచెలుగా కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడ‌ర్లు వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి, సోమశేఖ‌ర్, ఆసిఫ్‌, కౌన్సిల‌ర్లు మంకాల రాఘ‌వేంద‌ర్, అస్లాం, భీంసింగ్, బాతుల మ‌ధుబాల‌, స్టేషన్ హనుమాన్ దేవలయ చైర్మన్ సంజీవ్ రావు,నాయకులు బాతుల భీంశంకర్, బాతుల నాగరాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.