చైర్ పర్సన్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చైర్ పర్సన్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు
– పట్టణ సీఐకి ఫిర్యాదు చేసిన‌ సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ రాజ‌కీయాలు రంజుగా మారాయి. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త ప‌రిమ‌ళ్ గుప్త‌, సీపీఐ ఫ్లోర్ లీడ‌ర్ ఆసీఫ్‌ల మ‌ద్య రాజుకున్న ర‌గ‌డ వేడెక్కింది. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ప‌రిమ‌ళ్ గుప్త‌పై సీపీఐ ప్లోర్ లీడర్ ఆసీఫ్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఈ ఫిర్యాదును అందజేశారు. నిన్న‌ జరిగిన మీడియా సమావేశంలో చైర్ పర్సన్ భర్త పరిమళ్ గుప్త తనను ల‌క్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, మ‌తం పేరుతో దూర్భాలాషాలడాడని ఆరోపించారు. తమ వర్గాన్ని కించపరిచేవిధంగా దూషించారని అన్నారు. కావున చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్ ఉన్నారు.