రైలు ప్ర‌మాదాన్ని ఆపిన ఎర్ర‌చీర‌

క్రైం జాతీయం తెలంగాణ

రైలు ప్ర‌మాదాన్ని ఆపిన ఎర్ర‌చీర‌
– మ‌హిళ స‌మ‌య‌స్పూర్తితో త‌ప్పిన ప్ర‌మాదం
– నెట్టింట్లో వైర‌ల్, శ‌భాస్ అంటూ ప్ర‌శంస‌లు
ద‌ర్శిని డెస్క్: ఓ మ‌హిళ త‌న స‌మ‌య‌స్పూర్తితో రైలు ప్ర‌మాదాన్ని ఆపింది. వంద‌ల మంది ప్రాణాల‌ను తాను క‌ట్టుకునే ఎర్ర‌చీర‌తో కాపాడింది. నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఈ సంఘ‌ట‌న‌లో మ‌హిళ చాక‌చ‌క్యాన్ని ప్ర‌శంసిస్తూ శ‌భాష్ అంటూ కితాబిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) రాష్ట్రంలోని​ఎటా జిల్లాలోని గులేరియా గ్రామానికి చెందిన ఓంవతీ దేవి ప్ర‌తి రోజూ రైలు పట్టాల మీదుగా పొలానికి వెళ్తోంది. కుస్బా రైల్వేస్టేషన్​ సమీపంలో పొలానికి వెళ్లేందుకు ఆమెకు ఆ మార్గమే అలవాటు. రోజూ అదే రూట్లో పొలానికి వెళ్లి పనులు చేసుకునేది. రోజూవారీ లాగే తాను వెళ్లే మార్గంలోని రైలు పట్టాలపై నడుచుకుంటూ ముందుకు సాగుతోంది. రైలు పట్టా విరిగి ఉండటం చూసి హతాశురాలయ్యింది. ట్రాక్ పై రైలు వస్తే పెను ప్రమాదం తప్పదని భయపడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులను చెప్పాలనుకుంది. కానీ ఆమె వద్ద ఎలాంటి వస్తువులు, పరికరాలూ లేవు. వెంట‌నే సమయస్పూర్తితో ఆలోచించి తాను కట్టుకున్న చీరనే(Saree) రైలు పట్టాలకు అడ్డంగా కట్టింది. అంతే కొద్దిసేప‌టి త‌రువాత ఆ మార్గంలో వస్తున్న రైలు ప‌ట్టాల‌పై ఎర్రచీర‌ను గ‌మ‌నించి రైలును నిలిపివేసింది. అప్పటి వ‌ర‌కు ప‌ట్టాల‌ పక్కనే ఓంవతీ దేవి నిల్చుని ఉంది. రైలు అధికారులు కింద‌కు దిగి ప‌రిశీలించ‌గా ప్ర‌మాదాన్ని గుర్తించారు. రైలు పట్టా దెబ్బతిన్నట్టు లోకోపైలట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చాకచక్యంగా వ్యవహరించి వందల మంది ప్రాణాలు కాపాడిన ఆ మహిళను పలువురు ప్రశంసల్లో ముంచెత్తారు. మ‌రోవైపు విష‌యం తెలుసుకున్న‌ రైల్వే ఉన్నతాధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విరిగిన రైలు పట్టాను సరిచేశారు. గంట తర్వాత రైలు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది.

వీడియో కోసం కింద లింక్ చూడండి