కేంద్రంపై గులాబీ నేత‌ల క‌దం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేంద్రంపై గులాబీ నేత‌ల క‌దం..!
– నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌దీక్షలు విజ‌య‌వంతం
– పాల్గొన్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర వైఖ‌రిపై గులాబీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌దం తొక్కారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో సోమ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన టీఆర్ఎస్ నిర‌స‌న దీక్ష‌లు విజ‌య‌వంతం అయ్యాయి.
నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు, బ‌షీరాబాద్‌, యాలాల‌, పెద్దేముల్ మండ‌లాల్లో నిర‌స‌న దీక్ష‌లు చేప‌ట్టారు. యాలాల మండ‌లం, తాండూరు మండ‌లంలో చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌ల్లో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంత‌రం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్ మండ‌లం, బ‌షీరాబాద్ మండ‌లంలో చేప‌ట్టిన దీక్ష‌ల్లో పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడుతూ రైతులు పండించిన వ‌రిధాన్యాన్ని కొనుగోలు చేసేదా కేంద్రాన్ని వొదిలేదిలేద‌ని అన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది, నేడు బీజేపీ నిరంకుశ ధోరణి వల్ల మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రైతుల ప‌ట్ల కేంద్రం క‌క్ష్య సాధింపుకు పాల్ప‌డుతుంద‌న్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర‌మే కొనులు చేయాల‌న్నారు. లేదంటే గల్లి నుండి ఢిల్లీ వరకు ఉద్యమం తీసుకెళ్తామ‌న్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం త‌ర‌హాలో రైతుల కోసం ఢిల్లీ పై దండయాత్ర చేద్దామ‌న్నారు. వరి ధాన్యం కొనే వరకూ ఉద్యమం ఆగదన్నారు.
ఈ కార్య‌క్ర‌మాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచులు, మార్కెట్ క‌మిటి చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, పీఏసీఎస్ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, టీఆర్ఎస్ మండ‌ల పార్టీల అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు, మాజీ ప్ర‌జా ప్ర‌తినిధులు, రైతు స‌మితి నాయ‌కులు, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.