దళితుల ఆత్మగౌరవం పెంపొందేలా
– త్వరలోనే అంబేద్కర్ భవనాల నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన దళిత నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దళితుల ఆత్మగౌరవాలు పెంపొందేలా అంబేద్కర్ ఆత్మగౌరవ భనవాలను నిర్మించబోతున్నట్లు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు మూడు అంబేద్కర్ భవనాలను మంజూరు చేయగా తాండూరు పట్టణంలో రూ. 1కోటి, యాలాల మండలంలో రూ. 50 లక్షలతో నిర్మించబోతున్నారు. తాండూరు నియోజకవర్గానికి
2 అంబేద్కర్ భవనాలు మంజూరుకు కృషి చేయడం పట్ల ఆదివారం తాండూరు పట్టణం, యాలాల మండల దళిత నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి మంజూరైన అంబేద్కర్ భవనాల నిర్మాణానికి స్థలం సేకరించాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే వాటి నిర్మాణలకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
