ఇసుక ట్రాక్ట‌ర్ ప‌ట్టివేత‌

క్రైం తాండూరు వికారాబాద్

ఇసుక ట్రాక్ట‌ర్ ప‌ట్టివేత‌
– కేసు న‌మోదు చేసిన పోలీసులు
బ‌షీరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెల్ల‌వారు జామున అక్ర‌మంగా సాగిస్తున్న‌ ఇసుక ర‌వాణకు బ‌షీరాబాద్ మండ‌ల పోలీసులు చెక్ పెట్టారు. అనుమ‌తులు లేకుండా ఇసుక త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్‌ను ప‌ట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. బ‌షీరాబాద్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బ‌షీరాబాద్ మండ‌ల ప‌రిధిలోని మైల్వార్ గ్రామ శివారులో సోమ‌వారం తెల్ల‌వారు జాము 6గంట‌ల ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన తొప్ప‌రి బాల‌ప్ప అనే వ్య‌క్తి ట్రాక్ట‌ర్(టీఎస్34ఏ5893) ద్వారా అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసుల‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. గ్రామ‌శివారులో ప్ర‌త్యేక నిఘా ఉంచారు. అనుకున్న‌ట్లుగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్‌ను అడ్డుకున్నారు. ఇసుక ర‌వాణాకు సంబందించి ఎలాంటి ప‌త్రాలు లేక‌పోవ‌డంతో ట్రాక్ట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించి.. ఇసుక ర‌వాణాకు పాల్ప‌డిన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు బ‌షీరాబాద్ పోలీసులు వెల్ల‌డించారు. మండ‌లంలో ఎవ‌రైనా అక్ర‌మ ఇసుక ర‌వాణాకు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని బ‌షీరాబాద్ ఎస్ఐ విద్యాచ‌ర‌ణ్ రెడ్డి హెచ్చ‌రించారు.