మార్వాడి యువమంచ్ సేవలు ప్రశంసనీయం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– పట్టణంలో మూడు చలివేంద్రాల ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవలో తాండూరు మార్వాడి యువమంచ్ సేవలు ప్రశంసనీయమని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మార్వాడి యువంచ్ ఆధ్వర్యంలో పట్టణంలో మూడు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీఐ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తాండూరు మార్వాడి యువమంచ్ చేపట్టే సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్ సమయంలో మంచ్ చేసిన సేవలు మరువలేనివన్నారు. మంచ్ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
మరోవైపు మంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద ఏర్పాటు చేసిన రెండో చలివేంద్రాన్ని ప్రగతి సమాజ్ కార్యదర్శి ఉమాశంకర్ అగ్రవాల్, పర్తాని కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మూడో చలివేంద్రాన్ని నందకిషోర్ పర్తానిలు ప్రారంభించారు. మంచ్ సభ్యులు మహేష్ సార్డా రమేష్ చంద్రబూబ్, మురళీధర పర్తాని, మహేష్ పర్తాని, రాజేష్ సోని, కైలాస్ సార్డాల సహాకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచ్ నూతన అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు.



